25-05-2025 08:24:35 PM
హైదరాబాద్: విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు విచారణ మూడోరోజు ముగిసింది. ఈ కేసులో సిరాజ్, సమీర్ వాంగ్మూలాన్ని డిల్లీ ఎన్ఐఏ అధికారులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 12 మంది గ్రూప్ గా ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. సౌదీ హ్యాండ్లర్ల నుంచి అందిన నిధులపై కూపీ లాగిన ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాద విదేశీ లింకులు, పేలుళ్ల కుట్ర, ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సోషల్ మీడియా ఖాతాలు, అహీమ్ సంస్థ మూలాలు, విదేశీ కాల్స్ పై ఆరా తీశారు. మూడోరోజు విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. పేలుళ్ల కోసం హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబయిలో సిరాజ్, సమీర్ ఐదుచోట్ల రెక్కీ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ రెవెన్యూ అధికారి పాత్రపై కూడా ఆరా తీశారు.