04-11-2025 04:30:15 PM
							నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆశ్రమ గిరిజన పాఠశాలలో మంగళవారం గిరిజన నాయకుడు బిర్సా ముండా జయంతి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుందామని ఉపాధ్యాయులు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివాజీ రాజమౌళి ఉపాధ్యాయులు రమేష్ గజ్జరం తుకారం తదితరులు పాల్గొన్నారు