04-11-2025 04:25:57 PM
							ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్
రెబ్బెన,(విజయక్రాంతి): రెండో స్థాయి మహిళా ఆరోగ్య సిబ్బందికి (2nd ANM) గత రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెబ్బెన పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రిషికకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ... 2 నెలలుగా వేతనాలు అందక 2వ ఏఎన్‌ఎంలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇటీవల ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ నిర్వహించిన MPHAW (F), ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామక పరీక్షల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని, 7 నెలల PRC బకాయిలను చెల్లించాలని, ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించే విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 100% గ్రాస్ సాలరీ అమలులోకి తక్షణమే తీసుకోరావాలన్నారు.