calender_icon.png 23 May, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ మంత్రి, స్థానిక ఎమెల్యే సబితా ఇంద్రారెడ్డి

22-05-2025 12:00:00 AM

మహేశ్వరం,మే 21: మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో తుక్కుగూడ మున్సిపాలిటీ  పరిధిలో మంజూరైన 43 కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే ఇస్తామన్న తులం బంగారం,మహిళలకు 2500 రుపాయయలు కచ్చితంగా ఇవ్వాల్సిందే అని అన్నారు.అలాగే కేసీఆర్ కిట్టు తరహా కిట్టు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటూ నాన్చుడి ధోరణి ప్రదర్శిస్తుందని ఆమె విమర్శించారు.

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆమె దుయ్య  బట్టారు.ఇచ్చిన గ్యారెంటీల్లో ఏ ఒక్కటి సరైన పద్ధతిలో అమలు జరగడంలేదని ఆమె ఆరోపించారు.ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మేలుకొని గత ప్రభుత్వం చేసిన పనులను నేటి ప్రభుత్వానికి తేడాలు తెలుసుకోవాలని ఆమె సూచించారు.

చెక్కులు అందుకుంటున్న సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలోప్రజా ప్రతినిధులు, అధికారులు,మాజీ ప్రజాప్రతినిధులు,కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులు,  తదితరులు పాల్గొన్నారు..

ఘనంగా శంభో మహాదేవ విగ్రహ ప్రతిష్ఠాపన 

చేవెళ్ల , మే 21 : శంకర్పల్లి మున్సిపల్ పరిధి రామంతాపూర్ వార్డులో శంభో మహాదేవ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జబితారెడ్డి మాట్లాడుతూ.. దైవ చింతన ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, దైవభావంతో మానసిక ప్రశాంతత కలుగుందన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గండిచర్ల గోవర్ధన్ రెడ్డి, బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు రాఘవేందర్రెడ్డి, మాజీ సర్పంచ్లు వెంక రెడ్డి, మాణిక్ రెడ్డి, సీనియర్ న్యాయవతి ఉపేందర్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు శారద, మహేందర్ రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ పాపారావు, మాజీ కౌన్సిలర్ అశోక్, స్థానిక నాయకులు సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నారాయణ రెడ్డి, రవీందర్రెడ్డి, శ్రీనివాస్, ప్రవీణ్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.