22-12-2025 09:11:36 PM
మునిపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని లింగంపల్లి గురుకుల పాఠశాలలో గత 15వ తేదీ నుంచి జరిగిన జిల్లాస్థాయి క్రీడా పోటీలు సోమవారం ముగిసాయి. ఈ ముగింపు కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు హాజరై క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడాల్లో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ తాజుద్దీన్, హెచ్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఎంఈఓ బీమ్ సింగ్, లింగంపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సురభి చైతన్య, కాంప్లెక్స్ తుకారం, తెలంగాణ పిఈటిల అధ్యక్షుడు సుభాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.