22-12-2025 09:08:51 PM
సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి,(విజయక్రాంతి): శ్రీరంగాపురం మండలం జానంపేట గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ నాగరాజు వార్డు సభ్యులు హనుమంతు, ఇమ్రాన్, మొగులయ్య, రాజు, ఎల్లయ్య, సావిత్రి లు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వనపర్తి నందిహిల్స్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కండువాలు, శాలువాలతో సత్కరించి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇందిరమ్మ రాజ్యంలో నేడు నిరుపేదలకు ఉపయోగపడే పథకాలు అమలవుతున్నాయని మా గ్రామ అభివృద్ధి కాంక్షించి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.