calender_icon.png 29 November, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలిపే ధ్యేయం

29-11-2025 01:09:35 AM

బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కావలి ఐలేష్

గుమ్మడిదల, నవంబర్ 28 :స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ మద్దతుదారుల గెలుపు తథ్యమని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు కావలి ఐలేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం ప్రధాని నరేంద్ర మోడీ వైపు చూస్తుందని, ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటాయని తెలిపారు.

అలాగే మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి అండగా ఉంటారని గుమ్మడిదల మండల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కట్టుబడి పనిచేయాలని, ప్రజల్లో మంచి సేవలు అందించడమే గాకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే అభ్యర్థులను ఎంపిక చేసి నామినేషన్ దాఖలు చేస్తామని సూచించారు. గ్రామ స్థాయిలో పార్టీ శక్తిని మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.