calender_icon.png 29 November, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువు ఉన్నత స్థానంలో నిలుపుతుంది

29-11-2025 01:10:21 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, నవంబర్ 28 (విజయక్రాంతి): చదువు ఉన్నత స్థానంలో నిలుపుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.   పయనీర్ కార్యక్రమం లో భాగంగా ‘మహబూబ్నగర్ ఫస్ట్’ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థు లకు ఉచితంగా ఎప్సెట్, నీట్ ఎంట్రెన్స్ శిక్షణ స్టడీ మెటీరియల్స్ను ఎమ్మెల్యే తమ స్వంత నిధులతో అందజేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ విద్యార్థి దశలో కష్టపడి చదివితే భవిష్యత్తు విషయంలో ఎలాంటి ఆందోళన ఉండదని,  యువత ఈ దశలోనే తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాల సాధన కోసం శ్రమించాలి.

పుస్తకాలతో స్నేహం చేసి, క్రమశిక్షణతో ముందుకెళ్తే విజయం తప్పక వరిస్తుందన్నారు. చదువుపై నిర్లక్ష్యం చూపితే జీవితాంతం తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిం చారు. విద్యే యువతకు అసలైన ఆయుధమని, ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని దాన్ని సాధించే దిశగా అంకితభావంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం ఎప్సెట్లో పయనీర్ విద్యార్థులు 114 మంది ఉత్తమ ర్యాంకులు సాధించారని పేర్కొంటూ, ఈ సారి అంతకుమించి మరిన్ని ర్యాంకులు సాధించి మహబూబ్నగర్ ప్రతిష్టను  పెం పొందించాలని ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భగవంతచారి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘ వేందర్, మహబూబ్నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విద్యా నిధికి రూ.5 లక్షల  విరాళం అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్, నవంబర్ 28 (విజయక్రాంతి): మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మానసపుత్రికగా ఆవిర్భవించిన మహబూబ్ నగర్ విద్యా నిధికి నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కౌకుంట్ల చంద్రమౌళి రూ 2 లక్షలు ఇవ్వగా వారి కుటుంబ సభ్యులు కౌకుంట్ల అంజమ్మ, కౌకుంట్ల వెంకటరమణ, కౌకుంట్ల వందన  లక్ష చోప్పున ,  విద్యా నిధికి విరాళంగా రూ.5 లక్షల విలువైన చెక్కులను  ఎమ్మెల్యే కి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. 

ఈ సందర్భంగా చంద్రమౌళి గారు మాట్లాడుతూ విద్యాభివృద్ధిని ప్రతిష్ఠాత్మక లక్ష్యంగా తీసుకున్న ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి నిబద్ధత నాకు ప్రేరణగా నిలిచిందని, సమాజానికి శాశ్వతంగా నిలిచే సేవ విద్యే,అందుకే నా సంపాదనలో ఒక భాగాన్ని విద్యా నిధి ద్వారా పేద విద్యార్థుల భవిష్యత్తుకు అంకితం చేస్తున్నానని స్పష్టం చేశారు.  అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ,  మనము చేసే అనేక సేవలు కాల ప్రవాహంలో కలిసిపోతాయి. కానీ విద్యకు చేసే సేవ పది తరాలకు వెలుగునివ్వగలదు.   

విద్యా నిధికి చేయూత ఇచ్చిన కౌకుంట్ల చంద్రమౌళి గారిని వారి కుటుంబ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.   ఈ విద్యా నిధి ద్వారా పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, ఆర్థిక ఇబ్బందులతో చదువు మానాల్సిన పరిస్థితిలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఫీజు సహాయం, పుస్తకాలు, యూనిఫాంలు, పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్స్ అందించి వారి కలలను నెరవేర్చడమే ప్రధాన సంకల్పమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్, కౌకుంట్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.