29-11-2025 01:08:31 AM
మాగనూరు, నవంబర్ 28: నారాయణపేట జిల్లా కృష్ణా మండల సరిహద్దు గల కృష్ణ బార్డర్ చెక్ పోస్ట్, వద్ద శుక్రవారం తాసిల్దార్ శ్రీనివాసులు, ఎస్త్స్ర ఎంఎస్ నవీద్, ఎంపీడీవో విజయలక్ష్మి, పరిశీలించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ప్రతి వాహనాన్ని క్షుణ్ణముగా తనిఖీ నిర్వహించాలని గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోకి అక్రమంగా డబ్బు, మద్యం , ఇతర విలువైన వస్తువులు రాకుండా తనిఖీలు నిర్వహించి పట్టుకోవాలని అధికారులు తెలిపారు.
అదేవిధంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో నేపథ్యంలో గుడిబల్లూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ బూతులను పరిశీలించారు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయవలసిన ప్రాథమిక సౌకర్యాలు భద్రత చర్యలు తాగునీరు , విద్యుత్తు, టాయిలెట్ సదుపాయాలు, పహరి గోడలు, వికలాంగులకు, అవసరమైన సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు.
ప్రతి కేంద్రం వద్ద ఏర్పాట్లు పూర్తిగా ఉందో లేదో అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలు ఎలాంటి బెదిరింపులు లేకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకొని ఎలా అన్ని విధాల భద్రత చర్యలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. వీరు వెంబడి రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.