calender_icon.png 22 January, 2026 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి, బీఆర్ఎస్ లు చీకటి దొంగలు

30-10-2024 01:42:47 PM

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని..

కరీంనగర్ (విజయక్రాంతి): బిజెపి, బీఆర్ఎస్ లు చీకటి దొంగలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివ రావు అన్నారు. బుధవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితులకు ఈ రెండు పార్టీలు కారణమన్నారు. ఈ రెండు పార్టీలవి చీకటి ఒప్పందం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను అస్థిరపరిచి, శాంతి భద్రతలకి విఘాతం కలిగించే కుట్ర చేస్తున్నారని అన్నారు. వాళ్ల ట్రాప్ లో పడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. హామీల అమలుపై దృష్టి సారించాలని, హైడ్రా వల్ల పేదవారికి న్యాయం చేసి భరోసా నింపాలని, కబ్జాదారులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.