calender_icon.png 2 May, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన్ నేషన్ - వన్ ఎలక్షన్ తో ప్రభుత్వంపై తగ్గనున్న భారం

18-04-2025 05:33:45 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): బీజేపీ నాయకులు మంచిర్యాల పట్టణంలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో వాకర్స్ కలిసి వన్ నేషన్ - వన్ ఎలక్షన్ గురించి వివరించారు. లోక్ సభ, శాసనసభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ఖర్చు తగ్గి భారం తగ్గుతుందన్నారు. సమయం కూడా వృధా కాదన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ప్రజలందరికీ తెలియజెయాలని ఉద్దేశ్యంతో ప్రజల ముందుకు వస్తున్నామని, దీ నివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు.