29-07-2024 01:53:09 PM
న్యూఢిల్లీ: కోచింగ్ సెంటర్ ఘటనపై ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన చేపట్టింది. కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేశారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు నీటి ఫిరంగులు ప్రయోగించారు. పశ్చిమ ఢిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో అకస్మాత్తుగా వరదలు రావడంతో ముగ్గురు యుపిఎస్‌సి అభ్యర్థులు మరణించిన విషయం తెలిసిందే. ఈ మరణాలకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వమే కారణమని భారతీయ జనతా పార్టీ నిందించింది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు నేలపై బైఠాయించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా సోమవారం ఓల్డ్ రాజేందర్ నగర్ ప్రాంతంలోని నిరసన ప్రదేశాన్ని సందర్శించారు.