calender_icon.png 14 November, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన శాఖలోని పండిట్స్,పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలి

14-11-2025 01:51:43 AM

టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగ.రాంబాబు

ఆళ్ళపల్లి, నవంబర్13,(విజయక్రాంతి) :గిరిజన సంక్షేమ శాఖలో పండిట్ పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగ రాంబాబు అన్నా రు. టిపిటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భా గంగా ఆళ్ళపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత ప్రాథమిక పాఠశాలల, విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై తీసుకున్న మూడు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా మొ దటి దశ పోరాట కార్యక్రమంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల మర్కోడు,

ప్రభుత్వగిరిజన సంక్షేమ ఆశ్రమఉన్నత పాఠశాల అనంతోగు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,సిఆర్టిలు,డైలీ వేజెస్ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గురువారం ఫ్లెక్సీ,కరపత్రాలు, ప్లకార్డులు చేత బూని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ యాజమాన్యంలో కూడా పండిట్,పీఈటి పోస్టులు లేవని,అన్ని యాజమాన్యాలలోని పండిట్స్,పిఈటి పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేసి పదోన్నతులు ఇచ్చారని,

కేవలం గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలలో మాత్రమే పండిట్, పి ఈటి పోస్టులు కొనసాగుతున్నాయని, వెంటనే వాటిని అప్గ్రేడ్ చేసి వారికి పదోన్నతులు ఇవ్వాలన్నారు.గత 25 సంవత్సరాలు గా గిరిజన సంక్షేమ శాఖలో సిఆర్టిలు వెట్టిచాకిరికి గురవుతూ వారి జీవితాన్ని గిరిజన సంక్షేమ శాఖకు అంకితం చేసి పనిచేస్తున్నారని,వారి సర్వీస్ ను వెంటనే రెగ్యులరైజ్ చేసి మినిమం టైం స్కేల్ ఇవ్వాలనీ ,30 సంవత్సరాలుగా డైలీ వేజెస్ వర్కర్లు చాలీచాలని వేత నంతో పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం వారి యొక్క వేతనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నదని పడ్డారు.

తక్షణమే ఆ ప్రయత్నాలను విరమించుకొని వారి సర్వీసును రెగ్యులరైజ్ చేసి వారికి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని డి మాండ్ చేశారు. విద్యాశాఖలో మాదిరిగానే గిరిజన సంక్షేమ శాఖలో బదిలీలు , పదోన్నతులు చేపట్టాలని,కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు పాటర్న్ ప్రకారం రెగ్యులర్ పోస్టులను మంజూరు చేయాలన్నారు. ఈ ప్రదర్శనలో ఆళ్ళ పల్లి మండల అధ్యక్షులు బానోత్ భో జ్య,ప్రధానోపాధ్యాయులు చీమ ల భద్రమ్మ ఉపాధ్యాయునీ,ఉపాధ్యాయులు కొమరం. వసంత రావు, లక్ష్మయ్య, బాలకృష్ణ,రవికుమా ర్, రవీందర్ ,సోమేశ్,సాంబ శివ రావు నాగమణి,మమత రాణి లీలావతి, భద్రమ్మ, రాం బాబు, వినోద ,రాంబాయి,  తదితరులు పాల్గొన్నారు.