14-11-2025 12:59:36 AM
-బీఆర్‌ఎస్ హయాంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిర్వీర్యం
-ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
-నిజామామాద్ జిల్లాకు ఆయనే రాజు, ఆయనే మంత్రి
-పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
-నిజామాబాద్‌లో సుదర్శన్‌రెడ్డికి పార్టీ శ్రేణుల ఘనస్వాగతం.. సన్మాన సభ
నిజామాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) : అధిష్ఠానం తనకు అప్పగించిన బాధ్యతను గుర్తెరిగి, మరింత సమర్థవంతంగా పనిచేస్తానని, ముఖ్యంగా వ్యవసా య రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ సలహాదారుగా ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం మొదటిసారిగా నిజామాబాద్‌కు వచ్చిన సుదర్శన్‌రెడ్డికి పీసీసీ అధ్య క్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగ తం పలికారు.
నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ నుంచి పాత కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వేలాదిగా కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సన్మానసభ ఏర్పాటుచేసి, సుదర్శన్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. సన్మాన సభలో సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలలో, ఆసుపత్రులలో సౌకర్యాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదన్నారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్ అధిష్ఠానం తనకు అప్పగించిన బాధ్యతతో జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తానని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాకు చేసిందేమి లేదని, ఆసియాలో రెండో అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. తాము అధికా రంలోకి వచ్చాక 200 కోట్ల నిజాం షుగర్ ఫ్యాక్టరీ బాకీలు కట్టామన్నారు. వ్యవసాయపరంగా నిజామాబాద్ జిల్లాను మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు.
త్వరలోనే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రాబో యే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలుపించాలని కోరారు. జిల్లాలో మున్సిపాలిటీలో అభివృద్ధికి తమ పార్టీ అధికారం లోకి వచ్చాక రూ.500 కోట్లు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రె స్ పార్టీలో అపార అనుభవం కలిగిన సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వ సలహా దారులు మాత్రమే కాదని, ప్రత్యేకించి ఇకపై జిల్లాకు ఆయనే రాజు, ఆయనే మంత్రి అని పేర్కొన్నారు.
జిల్లాకు మెడికల్ కాలేజీ ఆయన చొరవతో వచ్చిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అన్నారు. 35 ఏళ్ల కల ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల తీసుకువచ్చామన్నారు. త్వరలో లింబాద్రి గుట్ట, సిద్దుల గుట్ట వద్ద పర్యాటక గెస్ట్ హౌజ్ కట్టబోతున్నాం అని ప్రకటించారు. బోధన్‌లో పామాయిల్ ఫ్యాక్టరీ త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం అని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు కల్పిస్తామని అందుకు పదవులు సైతం కల్పిస్తామన్నారు.