14-11-2025 12:50:05 AM
బెల్లంపల్లి అర్బన్, నవంబర్ 13: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ లో ఇటీవల వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాశంగా మారాయి. ఈ నేపథ్యంలో పార్టీ ప్రతిష్టను బజారుకీడ్చాయి. ఇలాంటి సంఘటలు పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం రేపాయి. తల నొప్పిగా మారిన అసమ్మతిపై ఎమ్మెల్యే ప్రధానంగా దృష్టి పెట్టారని సమాచారం. బెల్లంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మకం కోసం ఓ కాం గ్రెస్ యువ నేత మహిళా నేత (కొమురక్క) తో మంతనాల వ్యవహారంపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
వారి సంభాషణ వీడియో బెడిసికొట్టి కాంగ్రె స్ పార్టీ, ముఖ్యంగా ఎమ్మెల్యే, అతని పీఏల పరువు ప్రతిష్టకి భంగం చేసిన యువ నేతపై చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ విషయంపై స్వయంగా ఎమ్మెల్యే పీఏ కొమురక్కతో మాట్లాడిన ఆడియో కూడా వైరల్ అయ్యింది. ఇప్పుడి ఇదే పట్టణంలో సంచలనమైంది. రూ. 3 లక్ష లు ఇస్తే డబుల్ బెడ్రూం ఇళ్లు రెండు ఇప్పి ద్దాం.., ఎవరైనా మీ వార్డులో ఉంటే చెప్పు అని కొమురక్కతో అన్న మాటల ఆడియో బయటకు ఎలా వెళ్ళిందనే దానిపై ఆరా తీయడం ఆసక్తిగా మారింది...
ఈవిషయంపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ చాలా కోపంగా ఉన్న ట్టు కూడా అర్థమవుతుంది. అందుకే పీఏ రంగంలోకి దిగారు. కొమురక్కకు కాల్ చేసి జరిగిన విషయం తెలుసు కున్నారు. సదరు యువనేతను సార్ (ఎమ్మెల్యే), మీతో(పీఏ) టచ్‌లోనే ఉంటారు కదా..? మీ బలంతోనే కదా ఆయన అలా చేశారు... ఇందులో నా నా పాత్రేమి లేదు. అతని మాటలు నమ్మితే మోసపోయేదాన్ని అని కూడా ఆమె వాపోయారు...
మీకు దగ్గరనే భావంతోనే ఆయన అలా వ్యవహరించాడనీ మొఖం పట్టుకుని పీఏను నిలదీసింది. అంతే కాకుండా పార్టీ కోసం, ఎమ్మెల్యే గడ్డం వినోద్ గెలుపు కోసం ఎంత పని చేశా మో... మా హస్బెండ్ ఎంత కష్టపడ్డాడో మీకు బాగా తెలుసు కదా..? పార్టీలో కష్టపడే కార్యకర్తలకు మీరేమీ విలువ ఇవ్వడం లేదు కూడా అని విరుచుకుపడ్డారు. మీరు ఎవరికీ ప్రాధాన్యత ఇస్తున్నారో బాధ గా ఉందని ఆవేదనను పీఏతో కొమురక్క వెళ్లబోసుకున్నారు. సరే.. వీడియో బయటకు ఎలా వెళ్ళిందని మళ్లీ వీడియో లీక్ పై సదరు పీఏ దృష్టి మళ్లించారు.
ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందో, ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదూ.. పోనీ సారుకు కూడా మీరు చెప్పవచ్చు కదా.. ఎందుకని చెప్పలేదు... సార్‌నూ నేరుగా కలిసే చనువు ఉంది కదా.. అని మాట్లాడగా సదరు మహిళా నేత కొమురక్క మీరు మమ్ములను అస్సలు పట్టించుకోవడమే లేదాయే..
ఎలా చెప్పేద నీ.. గట్టిగానే సమాధానం ఇవ్వడంతో అలా కాదు మీ ప్రాధాన్యత మీకు ఉంది, మీకో సిస్టర్‌గా చెబుతున్నా, మా వైపు మిస్టిక్ లు ఏమైనా ఉంటే.. పరిశీలించుకొంటామని మళ్ళీ కలుద్దామని సంభాషణ ముగించారు. ఏదేమైనా డబుల్ బెడ్ రూమ్‌ల వ్యవహారం కాంగ్రెస్‌లో ఎవరి పుత్తెలు తెంపుతుందోనని ఆ పార్టీ శ్రేణుల్లో ఒకింత ఉత్కంఠత, ఆందోళన రేకెత్తిస్తుంది.
సూరిబాబు వివాదాస్పద వ్యాఖల కలకలం..
ఇదిలా ఉంటే ఇదే వ్యవహారాన్ని ఆసరా చేసుకుని మాజీ మున్సిపల్ చైర్మె న్ మత్తమారి సూరిబాబు బహిరంగంగా నే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఎమ్మెల్యేను ఇరకాటంలో పడే విధంగా చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సూరిబాబు వ్యాఖ్యలు అధికార పార్టీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపాయి. అటు కొమురక్క ఆడి యో, ఇటు సూరిబాబు సొంత పార్టీ లీడర్ల ధిక్కార వ్యవహారం అప్రతిష్ట పాలు చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ రెండూ సన్నివే శాలను క్రమశిక్షణ ఉల్లంఘన దృష్టితోనే చూస్తున్నారని తెలుస్తోంది.
ఈ కోణంలోనే చర్యలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై ఎమ్మె ల్యే స్పందించడం తప్పనీసరిగా కనిపిస్తున్నది. చర్యలు ఎలా ఉంటాయో.. అసలు ఉండవో అనే అభిప్రాయాలు లేకపోలేదు. కాంగ్రెస్ లో చెలరేగిన అసమ్మితికి పుల్ స్టాప్ ఈ మేరకు ఉంటుందో చూడాలి మరి. తన పరంగా ఎమ్మెల్యే ఆత్మావలోకనం చేసుకుంటారా..? లేదా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతుందా..? ఏమి డిసైడ్ చేస్తారో.. కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది.