calender_icon.png 14 November, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టార్గెట్ 6డిసెంబర్

14-11-2025 01:18:20 AM

బాబ్రీ కూల్చివేతపై ప్రతీకారానికి జైషే మహ్మద్ స్కెచ్

భారీ పేలుళ్లకు టెర్రరిస్టుల కుట్ర

ఐదు దశల్లో అమలుకు బిగ్‌ప్లాన్ దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడి నుహ్, గురుగ్రామ్ నుంచి రసాయనాలు కొనుగోలు కదులుతున్న ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు లింకుల డొంక

న్యూఢిల్లీ, నవంబర్ 13: ఎర్రకోట వద్ద పేలుడు వెనుక ఉగ్రవాదుల భారీ ప్రణాళిక ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా టెర్రరిస్టు మాడ్యూల్ భారీ స్కెచ్ వేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్ మొదలు పలు రాష్ట్రాల్లో టెర్రర్ మాడ్యూల్స్ ఒక పథకం ప్రకారం బీభత్సం సృష్టించేందుకు కుట్ర పన్నాయని బట్టబయలైంది.

ఉగ్రవాదుల లింకులు లాగి డొంక కదిపితే.. వచ్చే డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజున, ఆరు ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు ఉగ్రమూకలు కుట్ర చేశారని ఎన్‌ఐఏ ప్రాథమిక విచారణలో తేలింది. ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన డిసెంబర్ 6న ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఆరు ప్రదేశాల్లో ఒకేసారి వరుస పేలుళ్లకు జైష్ ఈ మహ్మద్ ఉగ్ర మాడ్యూల్ స్కెచ్ వేసినట్టు దర్యాప్తులో తేలింది. విచారణలో అరెస్టయిన నిందితులు బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవడమే తమ లక్ష్యమని స్పష్టంగా ఒప్పుకున్నారని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. టెర్రరిస్టు లు ఐదు రకాలుగా ప్లాన్ వేశారు. మొదట జైష్ ఏ మహ్మద్, అంసార్ గజ్వాత్  అనుబంధ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు.

తర్వాత హర్యానాలోని నుహ్, గురుగ్రామ్ ప్రాంతాల నుంచి ఐఈడీల తయారీకి రసాయనాలు, అమ్మోనియం నైట్రేట్, ఆయుధాలను సేకరించారు.మూడో దశలో ప్రాణాం తక కెమికల్ బాంబులు చేసి, టార్గెట్ ప్రాంతా ల ఎంపికను పూర్తిచేశారు.

నాలుగో దశలో తయారుచేసిన బాంబులను ముఠా సభ్యుల కు చేరవేసి, రహస్యంగా తరలించారు. ఆఖరి దశలో డిసెంబర్ 6న ఢిల్లీ పరిధిలోని ఆరు నుంచి ఏడు ప్రదేశాల్లో ఒకేసారి పేలుళ్లకు పథకం వేశారు. అయితే మొదట ఈ ఉగ్రదా డి ఆగస్టులో జరగాలి.

కానీ ఆపరేషన్ లోపాలతో వాయిదావేసి డిసెంబర్ 6వ తేదీకి మార్చారు.1992 సంవత్సరంలో బాబ్రీ కూల్చివేత అనంతరం జైష్‌నాయకుడు మసూద్ అజర్ అనేక సందర్భాల్లో అయోధ్యపై దాడు లు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిం దే.

ఈ క్రమంలో ఢిల్లీ పేలుడు కేసులో స్వాధీ నం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలు ఆ దాడులకే సిద్ధం చేశారని స్పష్టమైం ది. సహచరులు అరెస్టున తర్వాత భయంతో డాక్టర్ ఉమర్ తన కారులో ఉన్న బాంబును తానే పేల్చడంతోనే ఎర్రకోట పేలుడు ఘటన జరిగిందని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. 

అయోధ్య, ప్రయాగ్‌రాజ్ కూడా..

అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ను కూడా ఉగ్రవాదులు తమ టార్గెట్ లిస్టులో పెట్టుకున్న ట్టు సమాచారం. దేశంలో భయానకం సృష్టించేందుకు ఒకేసారి ఎక్కువ ప్రాంతాల్లో పేలుళ్లు చేయాలని ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

పేలుడు పదార్థాల భారీ నిల్వలతోపాటు వాటిని తరలించేందకు పాత్, సెకండ్‌హ్యాండ్ కార్లను కొని, వినియోగించాలని వ్యూహాలు రచించారు. ఇందులో భాగమే ఐ20 కారుతో పాటు మరిన్ని వాహనాలను వారు ఏర్పాటు చేసుకున్నట్టు తెలు స్తుంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అల్ ఫలా విశ్వవిద్యాలయాన్ని ఎన్‌ఐఏ బృం దాలు తనిఖీ చేస్తున్నాయి. 

మెడికల్ కాలేజీలోని బాయ్స్ హాస్టల్ ఉండే 17వ భవనం ఉగ్రప్రణాళికల కేంద్రం గా ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇందులో ముజమ్మిల్‌కు చెందిన 13వ గదిలోనే ఉగ్రకుట్రలు పన్నినట్లు గుర్తించారు. వర్సిటీ ల్యాబ్ నుంచి కొన్ని రసాయనాలు తేవాలని ఉమర్, ముజమ్మిల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు గదిలో కొన్ని రసాయనాలు, డిజిటల్ సామగ్రి, పెన్‌డ్రైవ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.