14-11-2025 01:49:59 AM
బీసీ జేఏసీ ప్రతినిధులు
మణుగూరు, నవంబర్13 (విజయక్రాంతి) : బీసీల కు విద్య,ఉద్యోగం, చట్టసభలలో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ నాయకులు గురువారం స్థానిక అం బేద్కర్ సెంటర్ లో ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో బీసీ జేఏ సీ నాయకులు బుర్ర సోమేశ్ గౌడ్, మండల అధ్యక్షులు పెనుగొండ సాంబశివరావు, కార్యదర్శి పొదిలి వీరబా బు మాట్లాడారు.
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. బీసీ లందరూ ఐక్యతను చాటాలని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు తమ గొంతులను బలంగా వినిపించి, రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయ ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు తమ ప్రయోజనాల పేరిట ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
బీసీ రిజర్వేషన్లకు చట్ట బద్దత కల్పించే విషయంలో కొన్ని పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, ఆ పా ర్టీలకు బీసీల పట్ల చిత్తశుద్ది లేదని విమర్శించా రు. రాజ్యాంగంలో పది శాతం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లను అమలు చేసి న నాయకులు, బీసీ రిజర్వేషన్లను ఎందుకు అడ్డు కుంటున్నారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్రం లోని అగ్రవర్ణ పాలకులు తా ము ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి, రాష్ట్రపతి ఆమోదం తో వెంటనే అమలు చే యాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రాజకీయ పార్టీలకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బీసీ జేఏసీ చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు ప్రజా సంఘాలు, పలు పార్టీలు సంఘీభా వం తెలిపాయి. మాల మహానాడు తమ సంపూర్ణ మద్దతు తె లిపింది. కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు, పీరినాకి నవీన్, బోనగిరి శివసైదులు, గాండ్ల సురే ష్, కూరపాటి సౌజన్య, సి పిఐ నుండి సరెడ్డి పుల్లారెడ్డి,దుర్గ్యాల సుధాకర్, మున్నూరు కాపు సంక్షేమ సంఘం నాయకు లు వనం కృష్ణమోహన్, గాండ్ల సురేష్, వలసాల వెంకట రామారావు, సిపిఐ ఎమ్‌ఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి యా కయ్య, సం జీవరెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో నాయ కులు గుర్రం శ్రీనివాస్, మధు, బోసెట్టి కవిత, రమాదేవి, పాల్గొన్నారు.