calender_icon.png 14 November, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ బోర్డులో ‘మామూళ్ల’ సిలబస్!

14-11-2025 01:08:34 AM

-ప్రైవేట్ కాలేజీలకు రెన్యువల్ పేరుతో కొర్రీలు 

-కాసులిస్తేనే  ఫైళ్లు కదిలేది..

-కార్పొరేట్ కాలేజీలపై అమితమైన ప్రేమ

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్పొరేట్ కాలేజీల కొమ్ము కాస్తూ.. తెలంగాణకు చెందిన చిన్నాచితకా కాలేజీలను ముప్పుతిప్పలు పెడు తోంది. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఇంటర్మీడియట్  కాలేజీలకు అనుమతి ఇవ్వకపోగా.. ఉన్న కాలేజీలను నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతూ వేలా దిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది.

దీంతో కొన్ని కాలేజీ లు ఇప్పటికే మూతపడగా, భవిష్యత్‌లో వందలాది కాలేజీలు మూతపడే పరిస్థితి నెలకొన్నది. అయితే శ్రీచైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీలు నిబం ధనలను తుంగలో తొక్కినా  చూసిచూడనట్లుగా ఉంటూ..  తమకేమి పట్టనట్లుగా నే అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే  ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినా..  కాసులు కురిపిస్తే మాత్రం ఫైళ్లు చకచకా కదులుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 

ప్రతి ఏటా కాలేజీలను ఇంటర్మీడియట్ బోర్డు వద్ద రెన్యువల్ చేసుకోవాల్సి ఉం టుంది. రెన్యువల్ చేసే ముందు కాలేజీలను తనిఖీచేసి నిబంధనల మేరకు ఉన్నాయా..? లేవా..? అని చూసి అనుమతులను రెన్యువల్ చేస్తారు. కానీ  తని ఖీలు చేసే సమయంలో ఏదో వంక పెట్టి ఒక్కో కాలేజీ నుంచి రూ. లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ‘మామూళ్లు’ ఇవ్వకపోతే ఆ కాలేజీకి ఏవేవో కొర్రీలు పెట్టి సతాయించడం ఇంటర్మీడియట్ బోర్డు  లో పరిపాటిగా మారింది.

అదే కార్పొరేట్ కాలేజీల విషయానికొస్తే నిబంధనల ను ఏమాత్రం పట్టించుకోకపోగా, కనీసం ఇంటర్ బోర్డు అధికారులు అటు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపణలున్నాయి. ఇక ఏదైనా కాలేజీ నష్టాల్లో ఉండి నడుపుకోలేని పరిస్థితి ఉంటే.. ఆ కాలేజీని అదే ప్రాంతంలో (మండల పరిధిలో) మరో కాలేజీ యజమాన్యం కొనుగోలు చేస్తే.. స్థానికంగానే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదే జిల్లా పరిది దాటితే కమిషనర్ స్థాయిలోనే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

కానీ, సచివాలయం వరకు ఆ పైళ్లను పంపడం, నెలల తరబడి తిప్పించుకోవడం జరుగుతోంది. కొ నుగోలు చేశాక.. కాలేజీ యజమాన్యం పేరు మార్పిడి జరగాలంటే పెద్దమొత్తంలో చేయి తడిపితేనే ఆ పైలు ముందుకు కదులుతుందని, లేదంటే ఆ పైలు అక్కడే దుమ్ము కొట్టు కుపోతుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి కాలేజీలో ఫైర్ సేప్టీ అనేది చాలా ముఖ్యం. అనుకోని ప్రమాదాలు జరిగితే.. వెంటనే వాటిని అదుపులోకి తీసుకోవడానికి అవకా శం ఉంటుంది.

కాలేజీ భవనం 15 మీటర్ల కంటే ఎత్తుగా ఉంటే ఆ కాలేజీ భవనానికి ఫైర్ సేప్టీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు దానిని 6 మీటర్ల  ఎత్తు వరకు తగ్గించింది. ఈ కొత్త నిబంధనలను  చిన్న చిన్న కాలేజీలకు వర్తింపచేస్తున్న ఇంటర్ బోర్డు.. అదే కార్పోరేట్ కాలేజీల విషయంలో చూసిచూడనట్లుగానే వ్యవహారి స్తోందని విమర్శలు ఉన్నాయి.

ఇంటర్ పరీక్షల విషయంలోనూ బోర్డు అధికారులు కొ త్త కొత్త రూల్స్ తీసుకొస్తూ  విద్యార్థులకు నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తున్నారని, ప్రాక్టికల్స్‌కు, పరీక్షలకు మధ్య తక్కువ సమ యం ఉండే విధంగా షెడ్యూల్ ఇవ్వడం వల్ల విద్యార్థులు తీవ్ర  ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా ప్రాక్టికల్స్ పరీక్షల స మయంలో సీసీ కెమెరాల ఏర్పాటుకూడా వివాదస్పదంగా మారుతుంది. ఇలా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తీసు కువస్తున్న కొత్త కొత్త నిబంధనలతో తెలంగాణ కాలేజీల యజమాన్యాలకు, విద్యార్థులకు నష్టం జరగకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. 

ఇంటర్ బోర్డులో ఉన్నతాధికారి తీరే వేరు..

ఇంటర్మీడియట్ బోర్డు  ఉన్నతాధికారి తీరుపై ప్రయివేట్ కాలేజీల యజమాన్యాలతో పాటు సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నట్లుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ కాలేజీలను ఇబ్బందులకు గురి చేస్తూ .. అదే ఆంధ్ర యజమాన్యంతో నడుస్తున్న కాలేజీలపైన ఆయన మక్కువ చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అందుకు ప్రధాన కారణం సదరు ఉన్నతాధికారి గతంలో శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి విజయవాడ బ్రాంచ్‌లో విధ్యను అభ్యసించారని, అందుకే శ్రీ చైతన్య, నారాయణ కాలే జీలంటే ఎనలేని ప్రేమను కురిపిస్తారనే ఆరోపణలున్నాయి. అయితే సదరు అధికారి తెలంగాణకు చెందిన వ్యక్తి అయినప్పటికి.. ఇక్కడి కాలేజీల విషయంలో వివక్ష చూపిస్తారని చెబుతున్నారు.

అయితే ఇంటర్మీడియట్ బోర్డులో జురుగుతున్న తతంగమంతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళదామంటే.. విద్యా శాఖ సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర ఉండటం వల్ల వాస్తవాలు అక్కడికి చేరడం లేదని ప్రయివేట్ కాలేజీల యజమాన్యాలు చెబుతున్నాయి.