20-10-2025 12:00:00 AM
మంత్రి పొన్నం ప్రభాకర్
రాజన్న సిరిసిల్ల, అక్టోబరు 19 (విజయ క్రాంతి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆదివారం మంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులు ఆమోదింపజేయాలని తెలిపారు.
కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి నేతృత్వంలో డిల్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ బిడ్డలుగా మీరు చొరవ చూపెట్టాలని కోరారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడిన మేము కాంగ్రెస్ పార్టీ గా తెలంగాణాకు మద్దతు ఇచ్చిన కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఎదురైందన్నారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల అమలు కు చొరవ తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కోరారు.