13-09-2025 03:27:58 AM
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ ( సీతక్క)
కామారెడ్డి, సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీతో నిబద్ధతతో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, పాల్వంచ మండల కేంద్రాల్లో మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథి హాజరై ఆమె మాట్లాడారు.
కొందరు కులం పేరుతో రాజకీయాలు చేస్తూ మన మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దేవుడు గుడిలో ఉండాలి మతం భక్తి గుండెల్లో ఉండాలన్నారు. బీసీ రిజ ర్వేషన్ పై రాష్ట్రం పంపిన బిల్లును కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆమోదించకుండా అడ్డుకుంటూ రాజకీయం చేస్తుంద న్నారు.
కుల గణనాల్లో బిజెపి బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొనలేదన్నారు. సోషల్ ఇంజనీర్ సోషల్ జస్టిస్ జరగాలని బీసీలకు పదవులు పంపకం చేసామని , రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బిల్లు ప్రవేశపెట్టామన్నారు. కొందరు సోషల్ మీడియా వేదికగా యూరియా కొరత సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ సోషల్ మీడియాను అడ్డం గా చేసుకొని అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని బధనం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డిని కొడంగల్‌తో సమానంగా అభివృద్ధి చేస్తానని కామారెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో అవి నెరవేరుస్తున్నామని తెలిపారు. బీసీ డిక్లరేషన్ డ్రాఫ్ట్ మానివాసంలోనే జరిగిందని కామారెడ్డి పట్టణంలోని డిక్లేర్ చేసి అమలు చేసేందుకు విజయోత్సవ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంటే వర్షం రావడం వల్ల వాయి దా వేయడం జరిగిందన్నారు.
వెనుకబడిన వర్గాలకు రాధిక అధికారం కల్పించడంలో తెలంగాణ దేశంలోని మొదటి స్థానంలో ఉందన్నారు. కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డీక్లరేషన్ తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొంది పార్లమెంట్లో ఆమోదం చేయడానికి ఢిల్లీలో ధర్నా చేస్తాం బిజెపి అసలు రంగు బయట పెట్టామన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నౌసీ లాల్, పల్లె రమేష్ గౌడ్, మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులు మహిళలు పాల్గొన్నారు.
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌ను పరిశీలించిన మంత్రి
కామారెడ్డి, సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 15న బిసి గర్జన సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలిం చారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రౌండ్ అంతా బురదమయం కావడంతో సభ అనుకూలంగా ఉంటుందా లేదా అని సందేహం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.