13-09-2025 03:20:35 PM
బిజెపి జిల్లా కార్యదర్శి వైజయంతి..
వలిగొండ (విజయక్రాంతి): తెలంగాణ విమోచన దినోత్సవం గ్రామ గ్రామాన నిర్వహించాలని బిజెపి జిల్లా కార్యదర్శి ఆకారం వైజయంతి(BJP District Secretary Vaijayanthi) పిలుపునిచ్చారు. శనివారం బిజెపి మండల అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైజయంతి మాట్లాడుతూ, అన్ని బూతుల్లో, అన్ని గ్రామాల్లో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణలు, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా అన్ని గ్రామాల్లో స్వచ్ఛభారత్, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కందుల తానేష, మందుల లక్ష్మి, పల్లెర్ల నరసింహ, లోడే లింగస్వామి, రాచకొండ కృష్ణ, బచ్చు శ్రీనివాస్, గంగ దారి దయాకర్ పాల్గొన్నారు.