calender_icon.png 13 September, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓపి సేవలు బహిష్కరించి నిరసన తెలిపిన వైద్య సిబ్బంది..

13-09-2025 03:00:58 PM

బోథ్ (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది శనివారం ఓపి సేవలను బహిష్కరించి నిరసనకు దిగారు. శుక్రవారం రాత్రి కనుగుట్ట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పురుగుల మందు తాగిన యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం డ్యూటీ డాక్టర్ పెషేంట్ ను రిమ్స్ ఆసుపత్రి కి రిఫర్ చేశారు. ఈ సందర్భంలోనే రిమ్స్ ఎందుకు రిఫర్ చేస్తున్నారని ఇక్కడే చికిత్స చేయాలని పేషెంట్ బంధువులు దూషిస్తూ ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేశారని వైద్య సిబ్బంది ఆరోపించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి ఆసుపత్రిలో ఔట్ పోస్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దు మణిగింది.