28-09-2025 04:49:05 PM
చిట్యాల (విజయక్రాంతి): ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని పక్షం రోజులు నిర్వహించే సేవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బీజేపి నాయకులు వికలాంగులను సన్మానించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ పిలుపుమేరకు ఆదివారం చిట్యాల బిజెపి పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో చిట్యాల పట్టణ కేంద్రం నికి చెందిన బొబ్బలి నాగేష్, బాదం శ్రీనివాస్ అను వికలాంగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు చికిలం మెట్ల అశోక్, కన్నీబోయన మహాలింగం, పల్లె వెంకన్న, జిల్లా మాజీ కార్యదర్శి బోడిగే అశోక్, జయరాపు రామకిష్ణ,కంచర్ల శంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందటి చంద్ర రెడ్డి, కార్యదర్శి కన్నీబోయన మురళి, బెల్లి నరేష్, సిలివేరు నాగరాజు, దామరోజు నాగరాజు, మేకల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.