calender_icon.png 28 September, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన భారీ వరద నీరు..

28-09-2025 04:47:22 PM

17 గేట్ల ద్వారా లక్ష  25 వేల క్యూసెక్కుల నీటి విడుదల..

నిజాంసాగర్ (విజయక్రాంతి): నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీటి ప్రవాహం పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి లక్ష 25 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుకుంటుండగా  ప్రాజెక్ట్ లోని 17 వరద గేట్ల ద్వారా ఒక లక్ష 25 వేల క్యూసెక్కులవరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ ఈ ఈ సోలోమోన్ తెలిపారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూరు ప్రాజెక్ట్, పోచారం, హల్ది వాగు ద్వారా భారీ వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో అంతే మొత్తంలో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.