20-12-2025 04:34:41 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రూరల్ బస్టాండ్ వద్ద రూ.10 లక్షలతో బయోమెట్రిక్ టాయిలెట్ నిర్మాణ పనులు చేపట్టారు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ శనివారం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇక్కడ తొలుత ఇతర కట్టడాలు, ఆటో స్టాండ్ ఉండేది. ప్రజల సౌకర్యార్థం వాటిని తొలగించి బయోమెటిక్ టాయిలెట్ ను నిర్మాణాన్నీ చేపట్టారు. అభ్యంతరం చెప్పిన ఆటో డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ చర్యను వ్యతిరేకిస్తూ, ఆటో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన ఆటోడ్రైవర్ సంఘం నేత రాంకుమార్ ను విడుదల చేయాలని రోడ్డుపై రాస్తారోకో చేశారు. టాయిలెట్ ను మరోచోట నిర్మించాలని, ఆందోళన చేపట్టారు. బెల్లంపల్లి సీఐ శ్రీనివాసరావు ఇలా ఆందోళన చేసి ప్రజల కు ఇబ్బంది కలిగించవద్దని, ఆటో స్టాండ్ విషయమై అధికారుల్ని అడిగాలని నచ్చచెప్పి ఆందోళన విరమింప చేశారు.డ్రైవర్ సంఘం నేతను విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో డ్రైవర్లు ఆందోళన విరమించారు.