20-12-2025 04:42:00 PM
న్యూఢిల్లీ: ఉపాధిహామీ పథకం పేరు మార్పుపై సోనియా గాంధీ(Sonia Gandhi) స్పందించారు. ఎంజీఎన్ఆర్ఈజీఏను(MGNREGA scheme) ప్రభుత్వం నాశనం చేస్తోందని సోనియా గాంధీ ఫైర్ అయ్యారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ రూపురేఖలనే ప్రభుత్వం మార్చిందని తెలిపారు. కోట్ల మంది రైతులు, కూలీల ప్రయోజనాలను దెబ్బతీశారని సోనియా గాంధీ ధ్వజమెత్తారు. గ్రామీణ పేదలను మోదీ ప్రభుత్వం(Modi Government) విస్మరిస్తోందన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో ప్రభుత్వం నల్ల చట్టం తెస్తుందని ఆరోపించారు. నల్ల చట్టంపై పోరాడేందుకు లక్షల మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆమె సూచించారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు(Congress Parliamentary Party Chairperson) సోనియా గాంధీ మాట్లాడుతూ, "20 సంవత్సరాల క్రితం డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, పార్లమెంటులో ఏకాభిప్రాయంతో ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టం ఆమోదించబడింది. ఇది పేదలకు ఉపాధిపై చట్టపరమైన హక్కును కల్పించింది. దీని ద్వారా గ్రామ పంచాయతీలను బలోపేతం చేసింది. ఎంజీఎన్ఆర్ఈజీఏ ద్వారా మహాత్మా గాంధీ కలల దిశగా ఒక పటిష్టమైన అడుగు పడింది. మోడీ ప్రభుత్వం పేదల ప్రయోజనాలను బలహీనపరిచేందుకు ప్రయత్నించింది. ఇటీవల, ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఏపై బుల్డోజర్ నడిపింది. ఎంజీఎన్ఆర్ఈజీఏను తీసుకురావడంలో అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. ఇది దేశంలోని ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన పథకం. దీని ద్వారా మోడీ ప్రభుత్వం పేదల ప్రయోజనాలపై దాడి చేసింది." అని సోనియా గాంధీ ఎక్స్ లో పేర్కొంది.