22-09-2025 08:59:45 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): వస్తు సేవలపై పన్నును (జీఎస్టీ) తగ్గించడంపై వినియోగదారులు వ్యాపారాలు, బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వస్తు సేవల పన్ను తగ్గింపు అమలగుచున్న సందర్భంగా మంగళవారం బిజెపి నాయకులు జాడి బాల్ రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, కిరాణా షాపులు, టీవీ షో రూమ్, బుక్ స్టాల్, మెడికల్ స్టోర్ సందర్శించి వినియోగదారులతో మాట్లాడారు. నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన నిత్యావసర వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తగ్గించడం పై వినియోగదారులుహర్షం వ్యక్తం చేశారు, జీఎస్టీని తగ్గించడంపై వ్యాపారులు తమ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.