calender_icon.png 22 September, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిపిఓ కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు

22-09-2025 09:52:42 PM

వేతనాలు చెల్లించాలని డిమాండ్

బతుకమ్మ,, దసరా పండుగలు ఎలా చేసుకోవాలి

ఆవేదన వ్యక్తం చేసిన గ్రామపంచాయతీ కార్మికులు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డిలో డిపిఓ కార్యాలయాన్ని గ్రామపంచాయతీ కార్మికులు ముట్టడించారు. తమ వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చి డిపిఓ కార్యాల యాన్ని ముట్టడించారు. చాలీచాలని వేతనాలతో ఎవరు చేయని, చేయలేని పనులైన మల, మూత్ర విసర్జనాలు చేసే మోరీలను డ్రైనేజీలను శుభ్రం చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నమన్నారు. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో గ్రామపంచాయతీ కార్మికులు సోమవారం సిఐటియు జిల్లా అధ్యక్షులు కందూరు చంద్రశేఖర్ తో కలిసి జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు.

ఏసీలలో కూర్చొని విధులు నిర్వహించే అధికారులకు గత ప్రభుత్వంలో 15, 20 రోజులు ఆలస్యంగా వేతనాలు వేస్తేనే వారు గగ్గోలు పెట్టారు. అలాంటిది చాలి చాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తే వారు ఎలా కుటుంబాలను పోషించుకుంటారని సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తుండగా కామారెడ్డి డి ఎల్ పి ఓ శ్రీనివాస్ అక్కడికి వచ్చి ప్రభుత్వం నుండి డబ్బులు వచ్చిన తర్వాతనే ఇస్తాం మీరు ఏం చేసినా లాభం లేదు మీరేం చేసుకుంటారో చేసుకోండి అని కార్మికులతో దురుసుగా మాట్లాడారు. పై అధికారులకు సమాచారాన్ని అందిస్తామని చెప్పడంతో కార్మికులు ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులు వచ్చి ఇక్కడ ఆందోళన చేయవద్దని కార్యాలయం బయటనే ఆందోళన చేయాలని ఐదుగురు వచ్చి మాత్రమే అధికారులకు వినతిపత్రం ఇవ్వాలనడం.

సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు మాత్రం ఎక్కడికైనా వచ్చే ఏమైనా మాట్లాడొచ్చా అని, ఎవరు చేయలేని విధులను ఈ గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్నారని, అలాంటి కార్మికుల పట్ల అధికారులు దొరుకుగా ప్రవర్తించడం దురుసుగా సమాధానం చెప్పటం ఏమిటన్నారు. దీంతో పోలీసులకు కార్మికుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్న వారు ఎస్సీ ఎస్టీ బీసీలు కావడంతోనే వారి పట్ల అధికారుల చిన్న చూపు చూస్తున్నారన్నారు. ముందు బతుకమ్మ పండుగ దసరా పండుగ ఉందని వాటికి మేము ఎలా ఖర్చులు చేసుకోవాలి డబ్బులు ఎక్కడినుండి తెచ్చుకోవాలి అని కార్మికులు పేర్కొంటున్నారు ఒక నెల వేతనమైన ఈ నెల ఇవ్వాలన్నారు.

ఈనెల 28 వరకు వేతనాలు ఇచ్చేలా చూస్తాం: జిల్లా పంచాయతీ అధికారి మురళి

జిల్లా పంచాయతీ అధికారి వచ్చే వరకు ఇక్కడ నుంచి మేము లేచేది లేదని కార్మికులు బిస్మించుకొని కూర్చోవడంతో అక్కడికి వచ్చిన జిల్లా పంచాయితీ అధికారి మురళి వచ్చి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ  టాక్సులు వసూలు చేసుకుని వేతనాలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 32 జిల్లాలలో పరిస్థితి ఇలాగే ఉందని రాష్ట్రమంతటా వచ్చిన సమయంలోనే కామారెడ్డి జిల్లాకు  వస్తాయని, అంతవరకు ఓపిక పట్టాలన్నారు. గ్రామాలలో టాక్సీల కోసం వెళ్తే ప్రజలు తిరగబడుతున్నారని కార్మికుల పేర్కొనడంతో ఒక నెల వేతనం ఈ నెల 28 వరకు ఇప్పిస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రం ఇచ్చే వెనుతిరిగారు.