calender_icon.png 22 September, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా నాయకుడు దామోదర్ రెడ్డిని విమర్శిస్తే ఖబర్దార్

22-09-2025 10:07:10 PM

- రాజకీయాల్లో ఆర్డీర్ ఆస్తులు కరిగిపోతే.. జగదీశ్ రెడ్డి ఆస్తులు గుట్టలుగా పేరుకుపోలేదా..?

- జంగాలపడిగను జగదీశ్ రెడ్డి పేరుగా మార్చుకోవడం సిగ్గుచేటు 

- పిల్లేరుగింతలు వేసినా మండలంలో బీఆర్ఎస్ ఒక్క సీట్ గెలవదు 

- కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తూముల సురేష్ రావు

పెన్ పహాడ్: ప్రజా నాయకుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవినే రాజీనామా చేసిన త్యాగాశీలి, తొలి కాంగ్రెస్ మంత్రిగా చరిత్రలో నిలిచిన మహనీయుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డిని ఏక వచనంతో స్థాయికి మించి మాట్లాడితే ఖాబర్ధారని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తూముల సురేష్ రావు మండి పడ్డారు. ఇటీవల సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫిస్ లో తమ ఆది నాయకుల అడ్వర్యంలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ల చిత్ర పటాలు ఏర్పాటు చేయడంతో ఓర్వలేక బీఆర్ఎస్ కు చెందిన కొందరు స్థాయికి మించి మాటలు, ఆగ్రహానికి గురయ్యే వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై సోమవారం మండల కేంద్రంలోని తన నివాసంలో మండల స్థాయి ముఖ్య నాయకులతో కలసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో దోసపహాడ్లోని జంగం పడిగ కాలనీని జగదీశ్ రెడ్డి కాలనీ పేరు పెట్టి మాయమాటలు చెప్పి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఒక్కటి కూడా కట్టించలేదని నేడు కాంగ్రెస్ హయాంలో ఈ కాలనీలో 30 ఇండ్లు ఇందిరమ్మ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు లెక్కలేనన్ని ఉన్న దామోదర్ రెడ్డి ఆస్తులు పేద ప్రజల కోసం, రాజకీయాల కోసం తరిగి పోయినా లెక్కచేయని దాన హృదయడన్నారు. ఉద్యమ సమయంలో జగదీశ్ రెడ్డి ఆస్తులు, పదేండ్ల పాలన నుంచి ఆస్తులు గుట్టలుగా పేరుకుపోయిన విషయం ఎవరిని కదిలించన తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఉనికి కోసం మండలంలో అపార్టీ అధ్యక్షుడు దొంగరి యుగేందర్, మరి కొంత మంది కలసి తమ ఆది నాయకులు దామోదర్ రెడ్డి, వేణారెడ్డిలపై తప్పుడు ప్రచారాలు, నోరు జారితే ఖాబర్ధార్ అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మండలంలో అన్ని స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎన్ని పిల్లేరిగింతలు వేసినా తుడుచుకుపోవడం ఖాయమన్నారు.