22-09-2025 09:42:51 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన కేశబోయిన శ్రవణ్ – సునీత దంపతుల కుమార్తె శరణ్య ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలో 530 మార్కులతో ఆల్ ఇండియా 24012 ర్యాంకుతో విజయం సాధించింది. హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ప్రభుత్వ సీటు సంపాదించింది. వెలిదండ గ్రామ15 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా ఒక యువతి ఎంబీబీఎస్ సీటు సాధించడం విశేషం. శరణ్య ప్రతిభతో గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సందర్భంగా గ్రామస్తులు, బంధుమిత్రులు శ్రవణ్ – సునీత దంపతులకు, శరణ్యకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.