22-09-2025 09:26:34 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు. కలెక్టరేట్ మహిళా ఉద్యోగులతో బతుకమ్మ పాటలతో పాటలు ఆడారు. మహిళలను ఉత్తేజపరిచారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. మహిళలు ఎంతో ఉత్సవంతో బతుకమ్మ ఆటలు ఆడడం వల్ల ఎంతో ఉల్లాసం, ఐకమత్యం వెళ్లి వీరుస్తుందన్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలలో మహిళలు పాల్గొని సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు.