22-09-2025 09:46:58 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోషియేషన్ లలో రిజినల్ లెవెల్ భాగంగా ఇల్లందు ఏరియా, మణుగూరు ఏరియా చెస్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాట్మెంటన్ పోటీలు మణుగూరు ఏరియాలోని భద్రాద్రి స్టేడియంలో జరిగాయి. ఈ పోటీలలో ఇల్లందు ఏరియా క్రీడా కారులు క్యారమ్స్ సింగిల్స్ లలో కలవల వెంకటేశ్వర్లు, డబ్బుల్స్ లలో సతీష్ కుమార్ విజయ్ కుమార్, టేబుల్ టెన్నిస్ వెట్రన్ లలో జాకీర్ హుస్సేన్ సింగిల్స్ లలో విజయ్, షటిల్ వెట్రన్స్ లో బోడ నాగేశ్వరరావు, ఆనంద్ గెలుపొందారు. వీరు మళ్ళీ కంపెనీ లెవెల్ జరగబోయే ఆటలలో ఆడ వలసి ఉంటుంది. అని స్పోర్ట్స్ సూపర్వైజర్ జాన్ వెస్లీ అన్నారు. ప్రతి ఏడాది సింగరేణిలో ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నదని ప్రతి క్రీడాకారుడు ఉద్యోగం తోపాటు ఆటలలో పాల్గొని తమలోని ప్రతిభను చాటాలని, క్రీడలలో ఇల్లందు ఏరియా ను కోల్ ఇండియా స్థాయిలో నిలపెట్టి రాణించాలన్నారు.