22-09-2025 10:02:25 PM
బాన్సువాడ ఎస్ఎస్ఎల్ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం
కామారెడ్డి,(విజయక్రాంతి): మేరా యువభారత్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 న నేషనల్ వాలంటీర్ రక్తదానం డే సందర్భంగా బాన్సువాడలో సోమవారం ఎస్ ఎస్ ఎల్ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సునీల్ రాథోడ్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది ఎందుకంటే ఒక మనిషికి పునర్జన్మని ఇస్తున్నాం, నేటి రోజుల్లో రక్తం చాలా అవసరం ఉందన్నారు.
ఎందుకంటే బాగా రోడ్ యాక్సిడెంట్లో, సిజరింగ్ డెలివరీ లు అయినప్పుడు ప్రతి ఒక్కరు రక్తం కోల్పోవడం వల్ల రక్తం ఎక్కువగా ఉపయోగపడుతుంద రోజురోజుకు రక్త దాతలు తగ్గిపోతున్నారు. నేటి యువకు అవగాహన లేకపోవడం వల్ల రక్తం దానం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదన్నారు. మానవ శరీరంలో 120 రోజుల్లో ఎర్ర రక్త కణాలు చనిపోతాయి అదే ఇంకొకరికి ఉపయోగపడే విధంగా రక్తాన్ని దానం చేస్తే అక్కడ మరో మనిషికి పునర్జన్మను ఇచ్చిన వాళ్ళం అవుతామని తెలిపారు. యువతరం ముందుకొచ్చి రక్త దానం చేయాలని అన్నారు.