calender_icon.png 24 May, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ కు అధికార దెయ్యం పట్టింది: మహేశ్ కుమార్ గౌడ్

24-05-2025 03:48:54 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన ఝలక్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మతి భ్రమించిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మహేశ్ కుమార్ ఆయనకు అధికార దెయ్యం పట్టిందన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పట్టిన దెయ్యం కేటీఆరే అని కవిత చెప్పకనే చెప్పారని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, హరీశ్ రావుకు నోటీసులు అందడంతో కేటీఆర్ షాక్ లో ఉన్నారని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.