24-05-2025 04:01:22 PM
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివ నాయక్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో లోని రెడ్ క్రాస్ బిల్డింగ్ లో భద్రాచలం డివిజన్ పోలీస్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా రెండు రోజులపాటు నిర్వహించే రక్తదాన శిబిరాన్ని శనివారం భద్రాచలం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వి శివ నాయక్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ లు లాంచనంగా ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో రెండు రోజులు పాటు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో పాల్గొన్న పోలీసు అధికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొక ప్రాణం నిలిపే అవకాశం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ ఎస్ఎల్ కాంతారావు రాష్ట్ర మెంబర్ యోగి సూర్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోట దేవదానం తో పాటు పలువురు పాల్గొన్నారు.