24-05-2025 04:06:05 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందా పురం గ్రామంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో కోదాడ నియోజకవర్గ బిజేపి పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కనగాల నారాయణ కూతురు కనగాల దివ్య పుట్టిన రోజు సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో ఆశ్రమంలో ఉన్న అనాధలకు వృద్ధులకు మానసిక వికలాంగులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించి తదుపరి పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ మాట్లాడుతూ... ఇలా ప్రతి ఒక్కరు తమ కుటుంబంలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వారికి ఇలా అన్న వితరణ కార్యక్రమం చేసి వారి ఆకలి తీర్చాలని అదేవిధంగా దాతలు దాతృత్వంతో ముందుకు వచ్చి వారికి తోచిన విధంగా నిత్యావసర వస్తువులు కూరగాయలు, బియ్యం, వగైరా ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఆశ్రమానికి అండగా నిలవాలని కోరారు. ముందుగా ఆశ్రమంలో ఉన్న. వృద్ధులు దివ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆశ్రమ కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి. తదితరులు పాల్గొన్నారు.