calender_icon.png 28 November, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక పోరుకు బీజేపీ సిద్ధం కావాలి

27-11-2025 12:00:00 AM

  1. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలవాలి
  2. అన్ని స్థానాల్లో పోటీ చేయాలి
  3. నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయా నికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, పార్టీ అభ్యర్థులను గెలిపించుకోఆలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అన్ని గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులను రంగంలోకి దించాలని, ప్రజలు కోరుతున్న మార్పునకు బలాన్నిచ్చేలా అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని, ఈ ఎన్నికలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి బలమైన పునాది కావాలని ఆయన పిలుపునిచ్చారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన.. పార్టీ ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కంటెస్టెడ్ అభ్యర్థులు, ఇతర ముఖ్య నాయకులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో రాంచందర్ రావు స్థానిక ఎన్నిక లకు సంబంధించిన అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు బీజేపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేయాలని, వారికి పార్టీ శ్రేణులు బలమైన మద్దతు అందించి, అత్యధిక స్థానాల్లో గెలువడానికి కృషి చేయా లని సూచించారు. రాష్ర్టంలో గత 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేశారని సమా వేశంలో నేతలు పేర్కొన్నారు.

14వ, 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామస్థాయిలో ఖర్చు చేయకుండా, కేంద్ర నిధులను దారిమళ్లించడం వల్ల గ్రామాల అభివృద్ధి నిలిచి పోయిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పంచాయతీల నిధులను విడుదల చేయకపోవడంతో అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేండ్లుగా ఒక్క రూపాయి కూడా పంచాయ తీలకు విడుదల చేయలేదని, 6 గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. వాస్తవాలను ప్రతి గ్రామానికి బీజేపీ శ్రేణులు చేరవేయాలని నేతలకు ఆయన సూచించారు.