calender_icon.png 28 November, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత రాజ్యాంగం ఈ దేశానికి దిక్సూచి

27-11-2025 12:00:00 AM

రాజేంద్రనగర్, నవంబర్ 26 (విజయక్రాంతి) : భారత రాజ్యాంగం ఈ దేశానికి దిక్సూచి లాంటిదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు క్యాసారం శంకర్రావు అన్నారు. భారత రాజ్యాంగం రచించి 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం రాజేంద్రనగర్ చౌరస్తాలోనే అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత రాజ్యాంగం రచించి నేటికీ 76 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు.

భారతదేశంలో ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన దినాన్ని రాజ్యాంగ దినోత్సవం గా చెప్పుకుంటున్నామన్నారు. అన్ని మత గ్రంధాలు వారి వారి మతాలకు ప్రభోదిస్తున్నట్లు గా ఈ దేశం లోని కుల మతాలకు అతీతంగా సర్వమతాలకు సర్వజనుల జీవితాలు మార్చేదే భారత రాజ్యాంగం అన్నారు. మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి అంకితం చేశారని తెలిపారు.

ఈ దేశ, రాష్ట్ర ప్రభుత్వలు రాజ్యాంగానికి లోబడిజీవించుచున్నారన్నారు. మాల మాదిగ ఉపకులాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావాలి అనంత రాములు, జయంతి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు మంత్రి చెంద్రశేఖర్, విరళ్లపల్లి మహేష్,, మల్కారం. ప్రసాద్, పోనోమోని. యాదగిరి యాదవ్, వాల్మీకి సంజీవకుమార్, దళిత రత్న. పత్యరా. నర్సింహా తదితరులు పాల్గొన్నారు.