07-05-2025 10:52:20 PM
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ ఎన్జీవోస్ కాలనీ ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న వివిధ కాలనీలలో వీధి దీపాలు వెలుగక ప్రజలు అంధాకారంలో మగ్గుతున్నారు. గత వారం రోజులుగా కాలనీలలోని వీధి దీపాలు వెలగడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఎన్జీవోస్ కాలనీ ప్రధాన రహదారి జంక్షన్లో సైతం హైమాస్ లైట్లు వెలగడం లేదని ప్రజలు అంటున్నారు. ఎన్జీవోస్ కాలనీని ఆనుకొని ఉన్న రాఘవేంద్ర నగర్ ఫేస్-1, ఫేస్-2లలో వారం రోజుల నుంచి వీధి దీపాలు వెలుగకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చీకట్లో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. చీకట్లో కుక్కల బెడదను సైతం ఎదుర్కోవలసి వస్తుందని కాలనీ వాసులు పేర్కొన్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు స్పందించి వెంటనే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.