12-12-2025 12:00:00 AM
ఎల్బీనగర్, డిసెంబర్ 11 : బీజేపీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా ఇన్చార్జి ఆలే భాస్కర్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా పదాధికారుల ముఖ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆలే భాస్కర్ మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీ బలం బూత్ స్థాయిలోనే ఉందని, ప్రతి బూత్ కమిటీ, శక్తికేంద్ర కమిటీని పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసి బలోపేతం చేస్తే విజయం మనదేనన్నారు.
రంగారెడ్డి జిల్లాలో రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఘన విజయానికి తీసుకెళ్లే బాధ్యత మనందరిదని తెలిపారు. కార్యకర్తల శ్రమే పార్టీకి నిజమైన శక్తి& ప్రతి ఇంటికీ బిజెపి సిద్ధాంతాలను చేరవేస్తాం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు బోల్గాం యష్పాల్ గౌడ్, బండారి భాస్కర్, అసెంబ్లి కన్వీనర్ కొత్త రవీందర్ గౌడ్, కార్పొరేటర్లు, జిల్లా పదాధికారులు పాల్గొన్నారు.