calender_icon.png 12 December, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఆల్ఫోర్స్ టైనీ టాట్స్ విద్యార్థి

12-12-2025 06:17:27 PM

మురంపుర,(విజయక్రాంతి): నగరంలోని వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ పాఠశాల విద్యార్థి జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎన్నికయ్యాడు. ఇటీవల కాలంలో ఆదిలాబాద్ స్విమ్మింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ తెలంగాణ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలలో పాఠశాల విద్యార్థి కే.స్వరన్ అత్యుత్తమ ప్రదర్శన కనబరచడమే కాకుండా రాష్ట్రస్థాయిలో రజత, కాంస్య పతకాలను గెలుచుకొని త్వరలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా విద్యార్థికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి పుష్పగుచ్చంతో పాటు అర్హత పత్రాన్ని అందజేసి అభినందించారు.  జాతీయ స్థాయిలోనూ  విజయఢంకా మ్రోగించాలని ఆకాంక్షించారు.