15-10-2025 04:49:17 PM
రైతులకు మార్కెట్ చైర్ పర్సన్ తిరుమల సమ్మయ్య పిలుపు..
కాటారం (విజయక్రాంతి): పాడి పంటలను సేద్యం చేస్తున్న వారు తప్పనిసరిగా పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా వేసే టీకాలను లాంఛనంగా ప్రారంభించారు. పాడి పంటల సేద్యం ద్వారా రైతాంగానికి, పశుపోషకులకు ఆదాయం లభిస్తుందని అన్నారు. అలాగే పశువులకు, మేకలకు సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
బుధవారం మండలంలోని ఒడిపిలవంచ, కాటారం, గొల్లగూడెం ప్రాంతాలలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేశారు. టీకాల ప్రాముఖ్యతను రైతులకు, పశుపోషకులకు కాటారం పశు వైద్యాధికారి డాక్టర్ జి రమేష్ వివరించారు. 150 గేదెలకు, 50 గోజాతి పశువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సమ్మయ్య, పశు వైద్య సహాయకులు తుంగల రాజశేఖర్, గోపాలమిత్ర శ్రీనివాస్, పశుమిత్ర నజీమా, రైతులు పశుపోషకులు పయ్యావుల నరేష్ యాదవ్, పర్వతాలు, గడ్డం కొమరయ్య, ఆత్మకూరి కుమార్ యాదవ్, మారుపాక రాజేంద్ర ప్రసాద్, అక్రమ్ పాల్గొన్నారు.