15-10-2025 04:41:40 PM
హైదరాబాద్: హనుమకొండ జిల్లా వడ్డేపల్లిలో నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వడ్డేపల్లిలోని పీజీఆర్ గార్డెన్‌లో నిర్వహించిన ఎమ్మెల్యే మాతృమూర్తి స్మారక కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, సీతక్క, అడ్లూరి, ఎంపీలు ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించారు.