15-10-2025 04:57:39 PM
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం ఫ్రెషర్స్ డే పార్టీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామాక పాండురంగ శర్మ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డిగ్రీ స్థాయిలోనే లక్ష్యాల నిర్దేశించుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉద్యోగాలను, ఉపాధి అవకాశాలను పొందాలని, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి అనుష, అధ్యాపకులు, భోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.