calender_icon.png 15 October, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తలాపురం చెరువులో వదిలిన చేప పిల్లలు

15-10-2025 04:52:34 PM

రూ.5 లక్షలు మత్స్యకారులు స్వంత ఖర్చులతో చేప పిల్లలు కొనుగోలు..

పెన్ పహాడ్: మత్స్యకారుల కుటుంబాలు స్వయం ఉపాధి పొందడంతో పాటు, మత్స్య ఉత్పత్తిని పెంచాలనే దృక్పథంతో చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలు ఈ సంవత్సరం ఆలస్యమైనది. దీంతో మండలంలోని భక్తళాపురం మత్స్యకార్మికులు సంఘ సభ్యులు కలసి రూ.5 లక్షలు పోగు చేసుకొని చేప పిల్లలను కొనుగోలు చేసి గ్రామంలోని చెరువులు, కుంటలలో చేప పిల్లలను వదిలినట్లు సోసైటీ అధ్యక్షులు వాడపల్లి లక్ష్మినారాయణ తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులలో పిల్లలు పోసే అదును సమీపించినందున 'ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూసి మోసపోకుమా.. శ్రీ శ్రీ అన్నట్టుగా మత్స్య కార్మికులంతా ఏకతాటిపై వచ్చి చెరువులలో చేప పిల్లలు పోసుకున్నామని ఆయన తెలిపారు. బతువు దెరువు కోసం అప్పులు తెచ్చుకోవలసి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు యాట ఉపేందర్, నీలాల సతీష్, వాడపల్లి రాంబాబు, వాడపల్లి ఉదయ్, జాడిగాలా నర్సయ్య, జాడిగాలా నాగయ్య, వాడపల్లి శ్రీను, నీలాల రామయ్య, నీలాల నరేష్, నీలాల జగన్ తదితరులు పాల్గొన్నారు.