16 June, 2026 | 2:37 AM

రైతుల కోసం బీజేపీ పోరుబాట

16-06-2026 01:30 AM

బోధన్, జూన్15 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం రోజున ఉదయం సమావేశమైన బీజేపీ నాయకులు రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందేలా చూడాలని, సాగునీటి సౌకర్యాలు మెరుగుపర్చడంతో పాటు పంట నష్టపోయిన వారికి తగిన పరిహారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి వడ్డీ మోహన్ రెడ్డి, ఇతర నాయకులు అడ్లూరి శ్రీనివాస్, , శ్రీధర్, సిర్ప సుదర్శన్, పసులోటి గోపికిషన్ తదితరులు మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతికి తమ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, అన్నదాతల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.