16 June, 2026 | 3:31 AM

విద్యార్థి సంఘం నాయకుడు నాగరాజుపై తప్పుడు ఆరోపణలను, కేసులను ఎత్తివేయాలి

16-06-2026 01:32 AM

బోధన్, జూన్15 (విజయక్రాంతి): బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీవో కు ఏసిపి కి సోమవారం రోజున మధ్యాహ్నం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ఎన్.బాల్ రాజ్ మాట్లాడుతు... స్థానిక బోధన్ పట్టణంలో గల చైతన్య ఒకేషనల్ కళాశాల యాజమాన్యం కిషన్  విద్యార్థులకు అధిక ఫీజులు వసూలు చేస్తూ, ల్యాబ్ మరియు ఎగ్జామ్స్ ఫీజులు కూడా అధికంగా వసూలుకు పాల్పడుతున్నారని, అదేవిధంగా చదువు పూర్తి అయిన విద్యార్థులకు టి సి, మేమేలు ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురించేస్తున్నారని తోటి విద్యార్థి సంఘం నాయకుడు నాగరాజుకు సదురు విద్యార్థులు ఈ విషయాలు చెప్పడం మూలంగా విద్యార్థి సంఘం నాయకుడు నాగరాజు పలుమార్లు యాజమాన్యంతో మాట్లాడిన సానుకూలంగా స్పందించలెరు. యాజమాన్యం మా కళాశాల మా ఇష్టం.

మీరెవరు మాకు చెప్పడానికి అని దురుసుగా నాగరాజుతో మాట్లాడి కావాలనే కాక్షపూరితంగా తప్పుడు ఆరోపణలు చేసి కేసుపెట్టడం జరిగింది. కావున అధికారులు పూర్తి స్థాయిలో చైతన్య ఓకేషనల్ కళాశాల పై సామాగ్ర విచారణ చేసి కళాశాల యజమాన్యం కిషన్  పై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మా విద్యార్థి సంఘం నాయకుడైన నాగరాజు పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఇకనైనా కళాశాల యాజమాన్యం విధానం మార్చుకొని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇచ్చేయాలని, లేని పక్షంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎంతవరకైనా పోరాడతామని, విద్యార్థులను సమస్యలకు గురి చేస్తే ఎవ్వరిని కూడా ఉపేక్షించమని విద్యార్థి సంఘాలుగా ఈ సందర్బంగా హెచ్చరిస్తున్నారు.  విద్యార్థి సంఘాల నాయకులు ఎం డి మోషిన్, తల్లారి సంజయ్, ప్రతాప్, రాజన్న, కిరణ్, మోహన్, రాజు, శ్రీను  పాల్గొన్నారు.