05-07-2025 12:33:48 AM
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
తుర్కయంజాల్, జులై 4:భారత రాజ్యాంగంలోని సో షలిజం, సెక్యులరిజం పదాల ను తొలగించాలనుకోవడం దేశ ప్రజలను అవమానించడమేనని, ఇది బీజేపీ కుట్రలో భాగమేనని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు, మాజీ అధ్యక్షుడు కాడిగాళ్ల భాస్కర్ ఆరోపించారు. శుక్రవారం మన్నెగూడ ఎన్‌ఎస్‌ఆర్ నగర్ కాలనీలోని చలసాని కళ్యాణ మండపంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సామాజిక శిక్షణ తరగతులు నిర్వహించారు.
కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ఇల్లూరి భాస్కర్ ప్రిన్సిపాల్ గా రెండురోజుల పాటు శిక్షణా తరగతులు సాగనున్నాయి. ఈ సందర్భంగా స్కైలాబ్ బాబు, భా స్కర్ మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాలలో దళితులపై దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోతున్నాయని, ఈ అమానవీయ సంఘటనలతో దేశం సిగ్గుతో తలదించుకుంటోందని అన్నారు.
ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో ఇద్దరు దళిత యువకులకు అరగుండు కొట్టించి, గడ్డి తినిపించడం హే యమైన చర్య అని అన్నారు. గోరక్షక దళాలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నాయని, చ ట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాయని, గోరక్షక దళాలను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రోద్బలంతోనే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అట్టడుగు వర్గాలపై జరుగుతున్న దాడులను అందరూ ఐక్యంగా ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోడ సామేల్, మస్కు ప్రకాష్ కారత్, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు గంధం మనోహర్, దుబ్బ చెన్నయ్య, ఎర్ర వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, వీరేష్, మాల్యాద్రి, నాయకులు జయ, ఆశీర్వా దం, ఎం. సత్యనారాయణ, రాందాసు, ప్రభాకర్, స్కైలాబ్, అశోక్, గిరి, రాజు, ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.