05-07-2025 12:32:28 AM
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి
అబ్దుల్లాపూర్ మెట్, జూలై 04: ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అబ్దు ల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూ ర్‌మెట్ మండల పరిధిలోని కుం ట్లూరు గ్రామ రెవెన్యూ సర్వే నెం బర్ 78లో ఉన్న ప్రభుత్వ భూ మిలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.
కుంట్లూరులో ప్రభుత్వ భూమిని అక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్లు రెవెన్యూ అధికారులకు సమాచారం అందడంతో.. తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ తన సిబ్బందితో వెళ్లి ఆ నిర్మాణాలను తొలగించేశారు. అదేవిధంగా తారామతిపేట గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 470, పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్ 58లలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ, అసైన్డ్ భూములలో నిబంధనలు పాటించకుండా ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే.. ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రాము, సిబ్బంది తదితరులుఉన్నారు.