13-09-2025 02:45:59 AM
ఎంపీ రఘునందన్ రావు
జిన్నారం, సెప్టెంబర్ 12 : దేశ భద్రత, అభివృద్ధి బీజేపీ లక్ష్యమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. జిన్నారం పట్టణంలో శుక్రవారం బీజేపీ మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా లక్ష్యం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రపంచంలో పదకొండు సంవత్సరాలుగా ప్రధానిగా ఉన్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ అని అన్నారు.
దేశంలోని ప్రజలు, అన్ని పార్టీల వ్య క్తులు కూడా మోడీ ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. దేశం మొత్తం బీజేపీ పాలన కోరుకుంటున్నదని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. మొన్నటి వరకు ఒక్కరు కూడా లేని ఈ ప్రాంతంలో ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్సీలు బీ జేపీ కార్యకర్తలకు అండగా ఉన్నారని తెలిపారు. త్వరలో జరగబోయే జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బీజేపీ తన సత్తా చాటుతుందని అన్నారు.
అనంతరం స్థానిక బీ జేపీ నాయకులు జిన్నారం సర్వేనెంబర్ ఒకటి, జంగంపేట లోని సర్వేనెంబర్ 376 భూ సమస్యపై రాతపూర్వకంగా ఎంపీకి వివరించారు. వావిలాల గ్రామానికి చెందిన సుధాకర్ గౌడ్, ఖా జీపల్లి వీరేష్, రఘురాములుతో పాటు మరో 20 మంది ఎంపీ రఘునందన్ సమక్షంలో బీజేపీలో చేరారు. వీరికి కండువాలు వేసి పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రతాపరెడ్డి, రాష్ట్ర నాయకులు ఎడ్ల రమేష్, రాజిరెడ్డి, సుధాకర్, ఐలేష్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.